MLA Bandaru : వాడపల్లిలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల కల్పన

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంచుతున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం ఆలయంలోని అంతరాలయ మూడు ప్రధాన ద్వారబంధాల వెడల్పు పనులను ఆయన ప్రారంభించారు.భక్తులు కనులారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి, క్యూలైన్ల పెంపుకు ద్వారబంధాల వెడల్పు పనులు దోహదం చేస్తాయన్నారు. అంతరాలయంతో పాటు మాడవీధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఊహించని విధంగా భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రభుత్వం ఆలయంలో సౌకర్యాల కల్పన పై దృష్టి సారించిందన్నారు.

కంపార్ట్మెంట్ లు, డార్మెటరీల నిర్మాణం, అద్దె గదుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.మాడ వీధుల వెడల్పు పనులు సైతం జరుగుతుందన్నారు. పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు దృష్టి సారించామని, స్వయంగా తాను జిల్లా అధికారులతో మాట్లాడానని 7 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఒకేసారి 3వేల మంది భక్తులు కూర్చుని భోజనం చేసే విధంగా వకుళమాత అన్నదాన కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15నుంచి మొదలయిందని అయితే మొదట్లో స్పెషల్ బస్సుల్లో ఈ సౌకర్యం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో వాడపల్లి ఆలయానికి వచ్చే బస్సుల్లో మహిళలకు ఉచితబస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

టూరిజం అభివృద్ధి నిధులతో వాడపల్లి అభివృద్ధి కి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు, దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఎమ్మెల్యే బండారుకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ), కుసంపూడి రామకృష్ణంరాజు, గనిశెట్టి వీరేష్, సురేష్ రాజు,పప్పుల బుజ్జి, ఏపుగంటి వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Facilities are being created in Vadapalli

You cannot copy content of this page

Scroll to Top