Kalyani Durga Prasad : బీజేపీ జిల్లా కార్యదర్శిగా కళ్యాణి దుర్గాప్రసాద్ నియామకం

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 17 : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని దీనబందుకాలనీకి చెందిన సీనియర్ నాయకులు కళ్యాణి దుర్గాప్రసాద్ రంగారెడ్డి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎన్నో ఏళ్లుగా వివిధ రూపాల్లో పార్టీకి, జిల్లా ప్రజలకు విశేష స్థాయిలో సేవలందిస్తున్న దుర్గాప్రసాద్ ను జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పని చేస్తూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిని కలుపుకుని ముందుకు సాగుతానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శిగా నియమితులైన దుర్గాప్రసాద్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kalyani Durga Prasad appointed

You cannot copy content of this page

Scroll to Top