Prema Kumar : హలో హైదరాబాద్ స్పోర్ట్స్ & ఈవెంట్స్ ఆధ్వర్యంలో 3 కె హ్యాండ్లూమ్ శారీ వాక్ లో పాల్గొన్న ప్రేమ కుమార్ దంపతులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 17 : ఈ రోజు హలో హైదరాబాద్ స్పోర్ట్స్ & ఈవెంట్స్ కమిటి లక్ష్మీ ఆధ్వర్యంలో 3కె హ్యాండ్లూమ్ శారీ వాక్ లో పాల్గొన్న ప్రేమ కుమార్ దంపతులు. కూకట్‌పల్లి లోని జెఎన్‌టియు వద్ద ప్రారంభమై ఫోరం మాల్ వరకు ఘనంగా హ్యాండ్లూమ్ శారీ వాక్ నిర్వహించబడింది. మన దేశ హస్తకళల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ వేడుకలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీమతి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని హస్తకళాకారుల కష్టాలు గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరాన్ని వివరించారు.

ఆయన మాట్లాడుతూ “చేనేత వస్త్రాలు మన సంప్రదాయం, సంస్కృతి, గౌరవానికి ప్రతీకలు. ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తేనే స్థానిక కార్మికులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది” అని పేర్కొన్నారు.అందరూ సంప్రదాయ శారీలతో నడిచి చేనేత వస్త్రాల అందాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని ప్రేమ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి జెఎన్‌టియు ఆడిటోరియంలో దీప ప్రజ్వలన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హ్యాండ్లూమ్ వస్త్రాల ప్రాముఖ్యత, చేనేత కార్మికుల కృషి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,వీర మహిళలు మరియు కార్యకర్తలు, అనేక మంది స్థానిక మహిళలు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prema Kumar Handloom Saree Walk

You cannot copy content of this page

Scroll to Top