నియోజక అభివృద్ధియే మా లక్ష్యం…!!
ప్రజలే మా శక్తి,-
ప్రగతియే మా మార్గం.
-శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
డిండి (గుండ్లపల్లి)ఆగస్టు 15, త్రినేత్రం న్యూస్. డిండిమండల కేంద్రంలోని ప్రాజెక్టు వద్ద గంగా హారతి కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. అనంతరం డిండి రిజర్వాయర్ నుండి ఆయకట్టు ద్వారా చందంపేట, నేరేడుగొమ్ము మండలాల చెరువులు, కుంటలు నింపుట కొరకు డిండి మండలంలోని కామేపల్లి స్టేజ్ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నీటిని విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు డిండి రిజర్వాయర్ నిండడంతో ఈ నీటిని విడుదల చేశారు. ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.రైతు కష్టానికి రుణమాఫీతో ఊరట ఇచ్చాం. ఎకరానికి పన్నెండు వేల పెట్టుబడి సాయం.రైతు భరోసా’తో పంట పొలాలు పచ్చగా మెరిశాయి.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, పంట పొలాలకు నీటి ప్రవాహం తీసుకొస్తాని అన్నారు.పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలనుకాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు డివిఆర్, రుక్మారెడ్డి, తూము బుచ్చిరెడ్డి బొడ్డేపల్లి వెంకటరమణ, అబ్దుల్ కలీం, కాశన్న, బాద ముని శ్రీనివాస్ గౌడ్, పోషాలు, బుష్పక వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


