దేవరకొండ ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మూడవ వార్డులో కొండలరావు బంగ్లా నుండి రాయల్ ఫంక్షన్ హాల్ వరకు టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుండి మంజూరు అయిన 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు, పదో వార్డులో నందిని రెస్టారెంట్ పక్కన దిండి రోడ్డు నుండి గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వరకు టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుండి మంజూరు అయిన 1.81 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని అన్నారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పనుల్లో జాప్యం లేకుండా త్వరిత ప్రతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని , ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.పలు వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


