AISF Foundation Day : డిండి లో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

విద్యార్థులకు అండ ఏఐఎస్ఎఫ్ జెండా.

ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సూరిగి వినయ్ కుమార్
డిండి (గుండ్లపల్లి)ఆగష్టు 12త్రినేత్రం న్యూస్. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను డిండి లో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సూరిగి వినయ్ కుమార్.* ముఖ్యఅతిథిగా హాజరై శ్వేత-అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘమని, స్వాతంత్ర్యం రాకపూర్వమే 1936 ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని, లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య పురుడోసుకున్నదాని,కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక్క ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే అని, నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పాఠశాలలలో కళాశాలలలో మౌలిక సదుపాయాల కల్పించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, మెస్ ,కాస్మోటిక్ చార్జీలను ధరలకు అనుగుణంగా పెంచాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలని, గురుకుల విద్యార్థులకు సొంత భవనాలను కేటాయించాలని అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలోఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపధ్యక్షులు ఏనమల్ల నవీన్ , ఏ ఐ ఎస్ ఫ్ నాయకులు భాను, సిద్ధూ, చరణ్,బన్నీ,పూజ, నిరోజ, స్ఫూర్తి,ప్రణవి, నిహారిక,శిరీష,శ్రావణి, సందీప్, శివ, పండు,అఫ్రోజ్,సురేష్, జస్వంత్,అఖిల, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AISF 90th foundation day celebrations

You cannot copy content of this page

Scroll to Top