MLA Jare : విద్యాభివృద్ధికి నేను సైతం చేయూతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమవ్వాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ నియోజకవర్గంలోని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యాభివృద్ధికి నేను సైతం చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల, పిల్లలకు అవసరమైన విద్యా, సామాగ్రి, ఉచితంగా అందిచాలని సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారి ద్వారా పలు పాఠశాలల విద్యార్థులకు, ఇప్పటికే విద్యాసామాగ్రిని అందజేశారు. ఈరోజు అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కమధాని సుధీర్ 1000 నోట్ పుస్తకాలను ఉచితంగా అందించారు.
ఆ పుస్తకాలను పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులకు,ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎంఈఓ కీసరి లక్ష్మీ, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, కూరం అర్జున్, బొల్లికొండ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the development of education

You cannot copy content of this page

Scroll to Top