త్రినేత్రం న్యూస్ ఆగస్టు 8 ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిని దాడి చేసి కరుస్తున్నాయి వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడించి కరుస్తున్నాయి గ్రామాల్లో సాధారణంగా పారిశుధ్య సమస్యలు అధికంగా ఉంటాయి కానీ దానికంటే కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు పాఠశాలలకు వెళ్లే పిల్లలు వృద్ధులు మరింత బెంబేలెత్తుతున్నారు వాహనాలపై ప్రయాణించే వారిని కుక్కలు గుంపుగా వెంబడిస్తున్నాయి కుక్కల సమస్యపై గ్రామస్తులు గ్రామ పంచాయితీల్లో కార్యదర్శులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని అంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


