అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 09 : పిఎసిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డీకే అబీన (గుంటూరు శిక్షణలో) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఉమ్మడి జిల్లా సహకార సొసైటీ బ్యాంక్ సీఈఓ వర్మ, తోటి సిబ్బంది నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, సీఈఓ వర్మ జీవో 90, 36 ప్రకారం అబీన కుమారుడికి పర్మినెంట్ ఉద్యోగం, మట్టి ఖర్చుల కోసం రూ.15 వేల ఆర్థిక సాయం, మిగిలిన బకాయిలను త్వరలో అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ ఉద్యోగులు, సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


