Dr. Satthi : నూతన గ్రామ కమిటీ సభ్యులను నియమించిన,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

TRINETHRAM NEWS

బిక్కవోలు మండలం కాపవరం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు గ్రామ అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, కొట్టు వీరవెంకట్రావు,ని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు, నూతన గ్రామ కమిటీ,మరియు గ్రామ అనుబంధ విభాగల కమిటీల్లో నియమితులైన సభ్యులకు అభినందలు తెలిపిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, బిక్కవోలు మండలం, కాపవరం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొని, నూతనంగా నియామకమైన కమిటీ సభ్యులను అభినందించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నూతన గ్రామ కమిటీలో కొట్టు వీర వెంకట్రావు,ని అధ్యక్షుడిగా నియమించారు. గ్రామ కమిటీ సభ్యులుగా సత్యంశెట్టి గోవిందరాజు, గంగులూరి సూరిబాబు, పోసిన వరప్రసాద్, సురేష్ దొర, బత్తిన సూరిబాబు, పిండి వెంకటేశ్వర్లు(నాని), ఆచంట సతీష్, తలారి కాంతారావు, కుంచెం వెంకట్రావు, కచ్చా ఆనందం ని నియమించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ, కాపవరం ఎంపీటీసీ మారెళ్ళ భీష్ముడు తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dr. Sathi Suryanarayana Reddy

You cannot copy content of this page

Scroll to Top