డిండి(గుండ్లపల్లి)ఆగస్టు 06 త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ డిండి మండల కేంద్రంలో బుధవారం ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాన్ని, అదేవిధంగా మండలములో నీ తవకలాపూర్ పిఎసిఎస్ ఆధీనంలో నిర్వహిస్తున్న ఎరువుల కేంద్రాన్ని ,మండల కేంద్రంలోని ఆగ్రో ఎరువుల దుకాణాన్ని, సాయి ఎరువుల దుకాణాన్ని ,తనిఖీలు నిర్వహించి ,ఎమ్మార్పీల ధరలకే ఎరువులను విక్రయించాలని, ఎటువంటి అక్రమాలకు పాల్పడరాదని, ఏవైనా అక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రెహనా, ఏఈవోలు, పిఎసిఎస్ సీఈవో బాల్రెడ్డి, అంతిరెడ్డి ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


