Sand Seized : అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు సిజ్

TRINETHRAM NEWS

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ సీఐ ఇంద్రసేన రెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పోలీసులు గుర్తించగా రెవిన్యూ శాఖ వారు సీజ్‌ చేశారు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సప్తగిరి కాలనీ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ ల ఇసుక డంపులను గుర్తించడం జరిగింది. సప్తగిరి కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు నిల్వ ఉంచిన విషయంపై గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి రామగుండం తహసీల్దార్‌ సమాచారం అందించగా వారు ఆర్ ఐ పంపగా వారి సమక్షంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుకను సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సిజ్ చేసిన తదుపరి విచారణ తరువాత వేలం వేసి వచ్చిన ఆదాయం ను ప్రభుత్వం ఖజానాకు పంపడం జరుగుతుంది అన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రామగుండంలో స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల స్థానిక అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుకునేలా కల్పించిన వెసలుబాటును కొంతమంది అక్రమార్కులు వారి స్వలాభం కోసం దుర్వినియోగం చేస్తూ అధిక లాభం కోసం ఇసుక అక్రమంగా తరలించి డంపులు గా పోసి అక్రమార్జన కోసం ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది ఇది చట్టరీత్యా నేరం . అక్రమంగా ఇసుక రవాణా చేసిన దంపుగా నిలువచేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Illegally stored sand dumps seized

You cannot copy content of this page

Scroll to Top