అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 06 : అరకువేలి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద స్మార్ట్ మీటర్ల అమలుకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అదానీ సెకీ ఒప్పందం రద్దు చేయాలని, పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు, అప్పటిలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ నాయకులు నారా లోకేష్ సైతం స్మార్ట్ మీటర్లను పగలగొట్టి వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ఒప్పందాన్ని అమలు చేయడాన్ని బలవంతంగా అమర్చి ప్రయత్నాలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వలన పేదలపై భారమైందని, రాబోయే రోజుల్లో దీని వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె. రామారావు, గిరిజన సంఘం నాయకులు గత్తుం బుజ్జిబాబు, చిట్టం నాయక్ గురుమూర్తి, పాంగి నానిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


