Support Disabled Pensioners : చేయూత వికలాంగుల పెన్షన్దారులను ప్రభుత్వం ఆదుకోవాలి -వై కే విశ్వనాథ్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఆగస్టు 4 ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో గంగారపు శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా వై కే విశ్వనాథ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎం ఎస్ పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల ఇన్చార్జ్ మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చేయూత పెన్షన్లు రూపాయలు 2000 నుంచి 4000 వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి6000 కండరాలు క్షీణించిన వారికి పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్న పెన్షన్ దారులను నమ్మించి మోసం చేశారు పెన్షన్లు పెంచి ఇచ్చేవరకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పింఛన్దారులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తామని దానిలో భాగంగా

ఈనెల 7న హాసినపర్తి మండలం చింతగట్టులో గల ఏం టీ ఆర్ గార్డెన్ వికలాంగుల చేయూత పెన్షన్ దారులు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జరగనున్న జిల్లా మహాసభ కు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు కావున మండలాల వారీగా వికలాంగులు పెన్షన్ దారులు అధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుండి తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని అన్నారు అదేవిధంగా 13 న జరగనున్న చలో హైదరాబాద్ చేయూత పెన్షన్ దారుల మహా గర్జన సభను లక్షలాదిగా వితంతువులు ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులు పెన్షన్ దారులు ప్రజలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నారు ఈ సమావేశంలో కందుకూరి సోమన్న మాదిగ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు సోంపల్లి అన్వేష్ మాదిగ పుట్ట ప్రశాంత్ మాదిగ సింగారపు పవన్ మాదిగ చిలుక రాజు మాదిగ పొట్ట శంకర మాదిగ ఒడ్డు ప్రణయ్ మాదిగ నక్క పవన్ మాదిగ బుచ్చి రాములు చిలుక మధుకర్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government should support disabled pensioners

You cannot copy content of this page

Scroll to Top