Tribal Associations : ప్రత్యేక డీఎస్సీ 1/70 పెసా చట్టాలు అమలుపై స్పష్టత కోరుతున్న గిరిజన సంఘలు

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకు లోయ, ఆగస్టు 05: (త్రినేత్ర న్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని, ఈ నెల 9న ముఖ్యమంత్రి వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. అరకువేలి మండలం సరభగుడలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన వందశాతం రిజర్వేషన్ హామీ అమలుకై ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని కోరారు. 1/70 చట్టం, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, అదానీ–నవయుగ సంస్థలకు జల విద్యుత్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కె. మగన్న, ఆనంద్, గోపి, ప్రసాద్, కళ్యాణ్, దేవ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribal associations seeking clarity

You cannot copy content of this page

Scroll to Top