Dr. Satthi : పేకాట పేటగా మారిన రామవరం – ఎమ్మెల్యే తమ్ముడి స్థలంలో గేమ్ షురూ!

TRINETHRAM NEWS

గోవా తరహాలో క్యాసినోలు

ప్రతిరోజూ పట్టపురాణి సంపద లక్ష్మీ,కి రామవరంలో జరిగే పేకాట క్లబ్ ల ద్వారా రూ.2 లక్షలు ముడుపులు

నువ్వు “ఎమ్మెల్యే” వా లేదంటే మనీ లాండరింగ్ కి అడ్వైజర్ వా -మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి : ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన రామవరం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక శాసనసభ్యుడి స్వగ్రామమైన రామవరంలో, ఆయన సోదరుడు గోపాలకృష్ణరెడ్డి యాజమాన్యంలో ఉన్న స్థలంలో పేకాట క్లబ్ నడుస్తుండగా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ రైడ్ నిర్వహించి 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్లబ్‌కి శాసనసభ్యుడి అనుచరుల ప్రమేయం కూడా ఉంది. పోలీసుల రైడ్ సమయంలో కార్లు, బైకులు, పెద్ద మొత్తంలో నగదు, కాయిన్స్(క్యాసినో తరహా కాయిన్స్) స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంలో స్థానిక శాసనసభ్యుడిని పలు మార్లు ప్రశ్నించినా ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ విషయంలో ఆధారాలతో పాటు ప్రశ్నించినా, ప్రతిస్పందించాల్సిన శాసనసభ్యుడు మౌనం వీడకపోవడం గమనార్హం. స్పందించే ధైర్యం లేక తన అనుచరులతో ఆ విషయాన్ని డైవర్ట్ చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామవరం, కుతుకులూరు, పొలమూరు వంటి గ్రామాల్లోనూ పేకాట క్లబ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఇక, ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన ముడుపుల్లో సింహభాగం పట్టపురాణి సంపద లక్ష్మీ,కి ప్రతిరోజూ రూ.2 లక్షలు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం పేకాట ద్వారానే శాసనసభ్యుడికి రూ.8 కోట్లు పైగా ముడుపులు అందాయి.

ఈ పేకాట క్లబ్ కేవలం సామాన్య పేకాట స్థాయి కాకుండా, గోవా తరహాలో కాయిన్స్ ద్వారా క్యాసినో మాదిరిగా నడుస్తోంది. ఒక్క కాయిన్ విలువ రూ.500 నుండి రూ.5000 వరకు ఉండగా, భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం కేవలం రూ.80,000 మాత్రమే. అంతేకాక, ఈ అక్రమ సంపాదనని లెక్కించటానికి సంపద లక్ష్మీ, ఇద్దరు క్యాషియర్లని కూడా నియమించుకున్నారు.

ఈ పేకాట క్లబ్ ప్రాంగణానికి సమీపంలో హైస్కూల్ ఉంది.ఆ హై స్కూల్ కి శాసనసభ్యుడి తండ్రి పేరు ఉంది.యువతను తప్పుదారికి దింపే ఈ అసాంఘిక కార్యకలాపాలపై శాసనసభ్యుడు స్పందించకపోవడం విడ్డూరం.

గోకులం పథకంలో నిర్మించాల్సిన షెడ్ ను నువ్వు గెస్ట్ హౌస్ గా నిర్మించుకోవాలని చూసావు.కానీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఊడిపోతాయి అన్న భయంతో వాటిని అడ్డుకున్నారు.ఎవరి ఉద్యోగాలు పోతే నీకు ఎందుకు, నీకు మాత్రం డబ్బులు అందాయా లేదా అన్నదే ముఖ్యం.

ఇలాంటి అక్రమాలు, అవినీతిమయ కార్యకలాపాలు ఎన్ని చేసినా వాటన్నింటికీ ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతూ, ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నివేదించడం జరుగుతుంది. త్వరలోనే నీ అసలు రూపాన్ని ప్రజల ముందు నిలుపుతాం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavaram turns into a poker room

You cannot copy content of this page

Scroll to Top