PM Modi : పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ..

TRINETHRAM NEWS

Trinethram News : 20వ విడత రూ.20 వేల కోట్లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి.. డబ్బు ఖాతాలో జమయ్యిందా? తెలుసుకోండిలా.. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.

కుడి వైపున కనిపిస్తున్న ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది. సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబరును ఎంటర్ చేసి ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి. స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకొని, ఈ-కేవైసీ పూర్తిచేసి ఉంటే ఖాతాలోకి డబ్బు జమవుతుంది.అలాగే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.

ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లబ్దిదారుడి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Modi releases PM Kisan Samman funds

You cannot copy content of this page

Scroll to Top