Disciplined Education : క్రమశిక్షణతో కూడిన విద్య బోధన

TRINETHRAM NEWS

తేదీ : 01/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , గ్రామాలు మంకుల్లు, మండపేట, మర్రి బంధం, చీపురుగూడెం మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా విద్యార్థులకు సంబంధించిన వివరణ చెప్పడం జరిగింది.
ప్రతిరోజు ప్రభుత్వం కేటాయించినటువంటి సమయపాలన ప్రకారం పాఠశాలలో తెరుస్తున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద సన్నబియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, ప్రతిరోజు విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని పెడుతున్నామని చెప్పడం జరిగింది. రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారు చేసినటువంటి చిక్కీలు అందిస్తున్నామని అన్నారు.

ఆటలు కూడా ఆడిస్తున్నామని తెలిపారు.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్ మరియు సంబంధించిన సామాగ్రి అందించామని పేర్కొన్నారు. సమయానుగుణంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని, అన్నారు. హాజరు శాతం తల్లికి వందనం పథకం కింద ఉన్న విద్యార్థులకు తమ తల్లుల బ్యాంకు ఖాతాలో రూపాయలు పడ్డాయని తెలిపారు. విద్యార్థులు మరియు వాళ్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Disciplined Education and Teaching

You cannot copy content of this page

Scroll to Top