CPI Leaders : నర్సమ్మకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు.

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిపిఐ, ఎఐటియుసి సీనియర్ కార్యకర్త రొంటాల లింగయ్య తల్లి రొంటాల నర్సమ్మ (85) అనారోగ్యం తో బాధపడుతూ శుక్రవారం ఉదయం మరణించారని విషయం తెలిసి గోదావరిఖని సీతానగర్ లో ఉన్న లింగయ్య ఇంటికి వెళ్ళి వారి తల్లి నర్సమ్మ భౌతిక దేహం పై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి కె.కనకరాజ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటెటి శంకర్, తొడుపునూరి రమేశ్ కుమార్, సిపిఐ నాయకులు కలవల జగన్నాథం, టి.ఆర్.సుందర్ రాజ్ తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI leaders paid floral tributes

You cannot copy content of this page

Scroll to Top