Lakshmanachari : ప్రేరణ లక్ష్మణాచారికి “బాలబంధు” అవార్డు

TRINETHRAM NEWS

Trinethram News : 25 సంవత్సరాల క్రితం “ప్రేరణ బాలల వేదిక” పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ,సంచార కుటుంబాలకు చెందిన వేలాదిమంది చిన్నారులను బడి బాట పట్టించిన సామాజిక కార్యకర్త, రిటైర్డ్ ఉపాధ్యాయులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి.అక్షర ప్రేరణ” వినూత్న విధానానికి రూపకల్పన చేసి హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ,యాదాద్రి భువనగిరి జిల్లాల లోని వలస కూలీల కుటుంబాల బాలబాలికలు ప్రాథమిక విద్యావకాశాలు అందుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న లక్ష్మణాచారి పలు అవార్డులను అందుకున్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సావిత్రి బాయి పూలే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరుగు కార్యక్రమం నందు ప్రతిష్టాత్మక “బాలబంధు” పురస్కారం అందజేయనున్నట్లు సావిత్రీ బాయి పూలే ఫౌండేషన్ అధి నేత శ్రీ మీనగ గోపిబోయ,ప్రధాన కార్యదర్శి శ్రీమతి సి.పరమేశ్వరి తెలిపారు. ఈ పురస్కారం రావడం పట్ల పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lakshmanachari gets "Prerna  Balabandhu" award.

You cannot copy content of this page

Scroll to Top