Future of Students : విద్యార్థుల భవిష్యత్తు ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 29/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి కొన్ని మండల పరిషత్ మరియు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా క్రమశిక్షణ తో కూడినటువంటి విద్యను అందిస్తున్నామని, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలపడం జరిగింది. సన్నబియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు గుడ్లు అదేవిధంగా రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారు చేసినటువంటి చిక్కీలు అందిస్తున్నమని ఉన్నారు.

ప్రభుత్వం సమయం పట్టిక ప్రకారం పాఠశాలను తెరుస్తున్నామని, సమయపాలన ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో , కొత్తగా ఎంతమంది జాయినింగ్ అయ్యారో తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన తల్లికి వందనం రూపాయలు వాళ్ల తల్లుల బ్యాంకు ఖాతాలో పడ్డాయని చెప్పడం జరిగింది. సామాగ్రి మొత్తము అందినట్లు చెప్పడం జరిగింది. మామిడి గొంది. సోడెం చరమన్న, జిల్లెల గూడెం కె నాగలక్ష్మి, పేడ్రా ల జి. రాజేష్, రెడ్డి నారాయణ పాలెం బి. రాంగోపాల్, గుంజవరం కె. నాగ వెంకటేశ్వర్లు, రామన్నపాలెం టి. విజయలక్ష్మి , తానలకుంట కౌలూరి.

రజనీకుమారి, కొత్త తాడగొంది కె. బాబురావు, వెంకటరెడ్డి గూడెం యస్. సోమరాజు, ప్రధానోపాధ్యాయులు, ప్రతి పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో చెప్పారు. విద్యార్థులు మరియు వాళ్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంపై ప్రశంశాలు కురిపించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the future of students.

You cannot copy content of this page

Scroll to Top