నాల్గవ తరగతి ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలి

TRINETHRAM NEWS

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

వరంగల్ జిల్లా 29 జూలై: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ హెచ్ ఎం లో పనిచేయుచున్నటువంటి కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని గత 3 సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహించిన ఫలితం రాలేదు.. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ నాలుగవ తరగతి ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం 10,400 ఇవ్వడం కరెక్ట్ కాదని నాలుగవ తరగతి ఉద్యోగులకు అన్యాయం చేశారని వెంటనే ఉద్యోగులకు న్యాయం చేయాలని,ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటీలోని ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు జూలై 26 న మహాధర్నా నిర్వహించటం జరిగింది కానీ ఇది జరిగి ఇప్పటికీ మూడు రోజులు అవుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు..

వెంటనే నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు ఎన్ హెచ్ ఎం లో అధికారులు ఈ సంస్థలో పనిచేయుచున్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఇందులో కొంత మందికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జీతాలు చెల్లిస్తూ కింది స్థాయి 4వ తరగతి ఉద్యోగులకు మాత్రం వారి పొట్ట కొడుతూ శ్రమదోపిడికి గురిచేయుచున్నారని వారు విమర్శించారు. తక్షణమే జీవో నెంబర్ 1195 లో నాలుగో తరగతి ఉద్యోగులకు 15,600 తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wages of class IV

You cannot copy content of this page

Scroll to Top