బి ఆర్ ఎస్ పార్టీ లో చేరికలు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం గడుస్తున్న నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం.
ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ ప్రజాధనాన్ని లూటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.
బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జులై 28 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు
సోమవారం దేవరకొండ పట్టణంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కొండమల్లేపల్లి మండలంలోని చింత చెట్టు, తండా ,వడ్త్య తండా, జేత్య తండా, ఫుల్ సింగ్ తండాలకు చెందిన 200 మంది యువకులు రైతులు మహిళలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని బిఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన నిధులకు కాంగ్రెస్ పార్టీ నేతలు మరొకసారి శంకుస్థాపన చేశారని ఆయన అన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయరు కానీ ప్రజాధనాన్ని లూ టి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు దేవరకొండలో కోటి రూపాయల ప్రజాధనం వృధా చేశారు అని కాంగ్రెస్ ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కోపంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తుచేస్తూ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. పార్టీ లో చేరిన వారిలో యువ నాయకులు నేనావత్ దేవేందర్, మాజీ సర్పంచ్ బద్రు నాయక్, మాజీ ఉపసర్పంచ్ భాగ్యమ్మ, ఏపీ సీఎస్ డైరెక్టర్ లక్ష్మీపతి ,రామావత్ శివ, తదితరులు పార్టీలో చేరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


