Trinethram News : Jul 28, 2025, జర్మనీలో సిగ్మరింగెన్ నుంచి ఉల్మ్ వెళ్లుతున్న ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలోని రీడ్లింగెన్ సమీప అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, 34 మంది గాయపడ్డారు. రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 40 కిలోమీటర్ల మేర రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


