Tribal Turmeric Farmers : గిరిజన పసుపు రైతులకు మహర్దశ కలుగుతుంది

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ జూలై 28 : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న జాతీయ టర్మరిక్ బోర్డు ఛైర్మన్ పల్లే గంగారెడ్డిని పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ వంపూరు గంగులయ్య, ప్రముఖ పసుపు పారిశ్రామిక వేత్త శ్రీమతి సుజిత రెడ్డి కలిసి గిరిజన ప్రాంతాల్లో పసుపు సాగు అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా 50,000 మెట్రిక్ టన్నుల పసుపు దిగుబడి వస్తోందని, అక్కడి గిరిజనులు సేంద్రీయ విధానాలతో పసుపు సాగు చేస్తారని వివరించారు. కర్క్యూమిన్ అధికంగా ఉండే ఈ పసుపుకు మార్కెట్‌లో విశేష డిమాండ్ ఉందని తెలిపారు.
గిరిజన రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించే వర్క్‌షాపులు నిర్వహించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribal turmeric farmers will

You cannot copy content of this page

Scroll to Top