గ్రామ పరిపాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్ష

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: సర్వేయర్ల పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు.
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 27న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్ష నిర్వహించే కేంద్రాన్ని అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సందర్శించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.
పరీక్ష కేంద్ర సందర్శనలో ఆర్డీవో వాచ్ చంద్ర, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామిరెడ్డి, డిఎండబ్ల్యుఓ రాజేశ్వరి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేమత్ అలీ లు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Village Administrative Officer and

You cannot copy content of this page

Scroll to Top