వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మండలం కొట్టాలగూడెం సర్వే నంబర్ 176 లో 29 మంది రిటైర్ ఆర్మీ ఉద్యోగులకు 116 ఎకరాల విస్తీర్ణం గల భూమి కేటాయించడం జరిగిందని వారి భూములపై నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్ తెలిపారు. వికారాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో భూములు అమ్ముకొని డబ్బులుతీసుకుని ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మళ్లీ ఆర్మీ భూములపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు.వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామ సిద్ధులూరు పాయగా సర్వేనెంబర్ 176 లో ఆర్మీ రిటైర్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల భూమి ఇవ్వగా 116 ఎకరాల భూమిని ప్రభుత్వం వారికి కేటాయించడం జరిగిందన్నారు.
రైతులకు కేటాయించిన భూములు అమ్ముకొని ఇప్పుడు మాకు కూడా భూములు ఉన్నాయని, వారు ఆర్మీ ఉద్యోగులకు కేటాయించిన భూములపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులను గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నరహరి అనే వ్యక్తి ఇతరులతో కలిసి భూమి అమ్ముకొని భారీగా డబ్బులు తీసుకొని మళ్లీ డబ్బుల కోసం ఇలాంటి ఆగడాలకు ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆర్మీ అధికారులను ప్రజలను మోసానికి గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రమేష్ నాయక్ కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


