రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పుకున్న సాంఘిక సంక్షేమ శాఖ!
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, జేగురుపాడు, షెడ్యూలుడ్ కులాల విద్యార్థులకు తల్లికి వందనo పథకంలో ప్రభుత్వం వివక్షత చూపిందని ప్రభుత్వం విడుదల చేసిన 13000రూపాయలు నిధులు పూర్తిగా దళిత తల్లుల అకౌంట్లో ఎవ్వరికీ వెయ్యలేదని జేగురుపాడు సర్పంచ్ మరియు వైస్సార్సీపి మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ తెలిపారు జరిగిన అన్యాయం గూర్చి స్థానిక అధికారులను ప్రశ్నించినా వారికి కుడా దీనిపై పూర్తి సమాచారం తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి దళిత విద్యార్థులకు జరిగిన అన్యాయం గూర్చి వివక్షత చూపించుట పట్ల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వo తరపున సాంఘిక సంక్షేమ శాఖ వివరణ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తకంగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 3.93లక్షల మందికి పూర్తి నిధులు జమచేయ్యలేదని కేంద్రం ఇచ్చే వాటా నిధులు 20 రోజుల్లో జమచేస్తామని ఒప్పుకొని ఒక ప్రకటన చేయుటపట్ల ఆశ్చర్యం వెలిబుచ్చు తున్నారు సమాజంలో దళితులు గాఉన్న పీడి త బాధిత పేదలకు విద్యను అందించవలసిన భాద్యత ప్రభుత్వాలుమీద ఉందని డా :బి, ఆర్, అంబేద్కర్ ఆశించారని అయన ఆశయాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత విద్యార్థుల పట్ల చిన్నచూపుతో తల్లికి వందనం పూర్తి నిధులు విడుదలలో వివక్షత చూపటం యావత్ దళితులకు అన్యాయం జరిగినట్లు భవిస్తున్నామని కావును ఇప్పడికయినా పార్టీలకు అతీతంగా దళిత ఎమ్మెల్యే, లు మంత్రులు, ప్రజాప్రతినిధులు,అధికారులు ఆస్వాదించాలి, స్టాలిన్ కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


