Trinethram News : Jul 23, 2025, తెలంగాణ : హైదరాబాద్ దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ రియాక్షన్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న మంటలను చూసి సమీప తండాల్లో నివాసమున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటన్నది తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


