జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 23 : “ఫిఫ్త్ షెడ్యూల్” ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ గిరిజనులకు అమలు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో జీవో నం.3పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, “జీవో 3” రద్దుతో ఆదివాసుల ఉద్యోగ అవకాశాలు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి (ఐఏఎస్) పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మైదాన ప్రాంతవాసులకు కాకుండా, గిరిజనులకే 100% ఉద్యోగాలు ఇచ్చే విధంగా విధానం ఉండాలి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు పాంగి చిన్నారావు. ఎంపీటీసీ దురియా ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాష్ రావు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Araku MLA Regam Matsyalingam

You cannot copy content of this page