MLA Vegulla : ఎమ్మెల్యే వేగుళ్ల ను కలసిన కేశవరం, పడమరఖండ్రిక పిఎసిఎస్ నూతన చైర్మన్ లు, మెంబర్లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కేశవరం, పడమరఖండ్రిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన ఉండమట్ల శ్రీనివాసరావు, పుత్సల శ్రీనివాస్ లు మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు. కేశవరం పిఎసిఎస్ మెంబర్లు గా చంద్రమళ్ళ సూర్యప్రకాశరావు, మేఘం సత్యనారాయణమూర్తి లు, పడమరఖండ్రిక పిఎసిఎస్ మెంబర్లు గా కర్రి పార్వతి, మాత వెంకటరమణ లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla meets new

You cannot copy content of this page

Scroll to Top