తేదీ : 20/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హనుమాన్ జంక్షన్ రైతుల సంక్షేమం కోసం కృష్ణ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అమలు చేస్తున్నటువంటి పథకాలను రైతులకు వివరించే బాధ్యతను, కొత్తగా నియమితులైన పి ఎస్ సి ఎన్ చైర్మన్ తీసుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ .వెంకట్రావు సూచించారు. బాపులపాడు మండలంలో జనసేన నుండి కొత్తగా నియమితులైన పిఎసిఎస్ చైర్మన్ గా వడ్డీ. శివ నాగేశ్వరరావు , కాకులపాడు చైర్మన్ గా యజ్జ వరపు శ్రీనివాస రావు, బిల్లనపల్లి.
చైర్మన్ గా బెజవాడ .వాసు, కొత్తపల్లి చైర్మన్ గా వడ్డీ .అశోక్ ఈ నలుగురి ప్రమాణ స్వీకారోత్సవం హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్డులోని కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకట్రావు, హాజరైనారు. ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి మేలు చేసేందుకు కేడీసీసీ పలు పథకాలను చేస్తుందని , వాటిని పి ఎస్ ఎస్ చైర్మన్ లు ఇంటింటికి వెళ్లి. రైతులకు వివరించాలని కోరారు. తాను చైర్మన్ గా సంవత్సరం కాలం పనిచేసిన సమయంలో రైతులకు విరివిరిగా రుణాలు ఇచ్చేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పడం జరిగింది. దీని ద్వారా రైతుల పిల్లలకు విద్య రుణాలు, ఇచ్చే కార్యక్రమాన్ని తాను చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రవేశపెట్టానని
ఈ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు నేడు విదేశాలలో చదువుకుంటున్నట్లు గుర్తు చేశారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న చైర్మన్ లు రైతులకు తలలో నాలుకల మెలుగుతూ వాళ్లకి చెరువు కావాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని చైర్మన్ లు, డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బందితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా చేపట్టాల్సిన పథకాలపై చర్చించినట్లు చెప్పారు. కొత్తగా నియమితులైన వాళ్లకు పాలన పరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని , వీళ్ళకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో క్షణం ఖాళీ లేకుండా బిజీగా ఉన్నప్పటికీ తన విజయం కోసం హనుమాన్ జంక్షన్ వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు
ఈ సందర్భంగా యార్లగడ్డ. మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త చలమలచెట్టి. రమేష్ బాబు, మండల టిడిపి అధ్యక్షులు దయ్యాల. రాజేశ్వరరావు,, ప్రధాన కార్యదర్శి పుట్టా. సురేష్, టిడిపి నాయకులు , మూల్పూరి. సాయి కళ్యాణి, కొమ్మారెడ్డి .రాజేష్, కాటూరి. విజయభాస్కర్, బిజెపి నాయకులు మురళీధర్, చీమల. రవి వర్మ, పాల్గొన్నారు. అనంతరం వేలేరు గ్రామంలో జరిగిన పి ఎస్ ఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


