డిండి (గుండ్ల పల్లి)జులై17 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి మాతకు గురువారం ఘనంగా అభిషేకం, వడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆర్యవైశ్య వాసవి మహిళ సంఘం వారిచే గ్రామ ప్రజల సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు గాదే హైమావతి హనుమాన్ చంద్రకళ, గాదే పుష్పలీల, జూలూరి పద్మ, ఏ లకుర్తి ప్రేమలత, పోలా రాధిక కాసం లలితమ్మ, పానుగంటి శ్రీదేవి, కొట్ర పద్మ లహరి, సముద్రాల సంధ్యా, బి క్కుమాండ్ల సౌజన్య, అర్థం స్వరూప, కొత్త ధనలక్ష్మి తో పాటు పలువురు మహిళలు మరియు ఆర్యవైశ్య నాయకులు హను మాండ్ల కేశవులు, గాదే కుమారస్వామి, కాసం రామస్వామి, జూలూరి వెంకటేష్, పోలా వెంకటేష్, ఎలకుర్తి మల్లేష్, తదితరులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


