వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మండల అధ్యక్షులు బుగ్గయ్య గౌరవ అధ్యక్షులు ఉస్మాన్ అలీ ప్రధాన కార్యదర్శి రాకేష్ ఆద్వర్యం లో ముఖ్య అతితులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ సభ్యత్వ కార్యక్రమాన్ని ZPHS Girls పాఠశాలలో ప్రారంభించడం జరిగింది .కార్యక్రమం లో మండల అధ్యక్షులు బుగ్గయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై మండల శాఖ ముందున్నదని తెలిపారు.
మండలం లోని పెండింగ్ బిల్లుల సమస్యల గురించి ఉపాధ్యాయుల సర్దుబాటు సమస్యల గురించి SGT ఉపాధ్యాయుల సమస్యల గురించి రాష్ట్ర,జిల్లా శాఖ కు వివరించడం జరిగింది కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ మాట్లాడుతూ పి ఆర్ టి యు సభ్యత్వం ఒక వరం గత 52 సంవత్సరాలుగా అనేక సమస్యలను సాధించడంలో PRTU సంఘము ముందుందని ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం పనిచేస్తున్న ఏకైక సంఘం PRTU అని తెలియచేయడం జరిగింది.
దానితో బాటు పెండింగ్ బిల్లులు సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేవిదంగా చూస్తామని తెలియ చేశారు. కార్యక్రమం లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, ,గోపాల్ , శంకర్ ,సుభాష్ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు రామాంజనేయులు, వెంకటయ్య, ఉపాధ్యక్షులు B. శ్రీనివాస్ , రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్,జిల్లా బాధ్యులు ఇబ్రాహీం, రాజేష్ రాథోడ్,ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్,రాఘవేందర్, శీనయ్య, జైపాల్ రెడ్డి, పాండు,జావేద్, వెంకట్ ప్రసాద్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


