తేదీ : 17/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్టణం, బొమ్మలూరు రోడ్డు లో ఉన్నటువంటి టిడ్కో మరియు ఎన్టీఆర్ కాలనీ పరిధిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ స్టేషన్ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి హోం మంత్రి మంగళ పూడి అనితను శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆ కాలనీ లో ప్రస్తుతం నివాసం ఉంటున్న కుటుంబాలు రానున్న రోజుల్లో పెరగనున్న నిష్పత్తి వివరాలను అతను ఆమెకు వివరించారు.
ఈ రెండు కాలనీల పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లకు సరిపడ జనాభా రానున్న రోజుల్లో పెరుగుతారని , అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రితో అన్నారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యాలయంలో మంత్రులు అనిత, కొల్లు. రవీంద్ర, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి
ఎమ్మెల్యే పాల్గొని భూమి పూజ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


