తేదీ : 16/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామ పరిధిలో గత ఐదేళ్లుగా సచివాలయం లో పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యారు. వాళ్లు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వేరే గ్రామాలకు బదిలీపై వెళ్తున్న సిబ్బందిని గ్రామ ప్రజల తరఫున ఘనంగా వీడ్కోలు పలికి సత్కరించారు. మండల టిడిపి అధ్యక్షులు మూర కొండ. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి మా కాని. వెంకాయమ్మ, ఇబ్రహీంపట్నం మండలం తెలుగు రైతు అధ్యక్షుడు జొన్నలగడ్డ. సురేంద్ర, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


