వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకోరావాలని చేవెళ్ల పార్లమెంటరీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నార మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తలాప్ మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు. వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ. ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజాంలో మార్పు తీసుకురావొచ్చన్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులే మాట్లాతారు కాబట్టి మీడియా ప్రతి నిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను, వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఆయన తెలిపారు.
దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారత ప్రభుత్వం ఈ దేశాభివృద్ధితో పాటు తెలంగాణను కూడా అభివృద్ధి చెస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా కృషి చేయాలని దీని వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే విధంగా వార్తల ద్వారా సహాయ పడేందుకు మీడియా పాత్ర పోషించాలని కలెక్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మీడియా వర్క్ షాప్ కు అసిస్టెంట్ కలెక్టర్ హర్షీ చౌదరి, పీఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస క్రిష్ణ కాంత్, పీఐబి ఏడీజీ శృతి పాటిల్, ఎం అండ్ సిఓ శివచరన్, సిడిఏసీ ప్రాజెక్టు మేనేజర్ జగదీష్ బాబు, ఎస్బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లు విధ్యాదర్, శ్రీహరి, వికారాబాద్ జిల్లాలోని మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


