వరంగల్ జిల్లా 14 జులై: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ నేరేడ్ మెట్ కి చెందిన మెతుకు ఉప్పలయ్య కు తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డు 2025 జాతీయ పురస్కారం సత్కారము తో వరంగల్ రామయ్య ఫంక్షన్ హల్ లో సన్మానం చేయడం జరిగింది.సామాజిక సేవ విభాగం లో విశేషంగా కృషిని గుర్తించి ఇట్టి జాతీయ పురస్కారం ఇవ్వడం జరిగింది పేద ప్రజలసంక్షేమం..కార్మికుల మరియు ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం, అవినీతి నిర్మూలన , మొదలైన అంశాలలో తన వంతు కృషి చేస్తున్నారు..
ఎన్.జి.ఓ. మేనేజ్మెంట్ సర్టిఫికెట్ ప్రోగ్రాం పూర్తి చేయడం, స్వయం పోర్టల్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ లా తదితర పాఠ్యాంశాలు అభ్యసించడం,సమాచార హక్కుచట్టం పై అవగాహన పెంచుకోవడం,వివిధ పుస్తకాలు దినపత్రికలు చదవడం వలన తనకు విజ్ఞానాన్ని పెంపొందించుకున్నట్లు , మరియు తన కుటుంబ సమస్యలు, సమాజం లో కొందరు సృష్టించిన సమస్యలు ఎదుర్కొనే దిశ లోనే సమాజ సేవకుడయ్యానని. ఆయన తెలిపారు.ధనం మరియు, అధికారం ఆశ లేకుండా ఇతరుల సమస్యలను తమ సమస్యలు గా భావించి సలహాలు, సూచనలు ఇస్తూ విలువైన సమయాన్ని కేటాయించి నిస్వార్థ సేవ చేస్తేనే సామాజిక సేవకుడు అవుతాడని మరియు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించిన కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేయాలని మెతుకు ఉప్పలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏలాంటి ఆస్తి ,ఆదాయం, డబ్బు ఆశ లేకుండా తన కుటుంబ పెద్దలకు తల్లి, తండ్రి, అమ్మమ్మ కు సేవలు చేసిన తన భార్య విజయలక్ష్మి తగిన సేవలు అందించి సమాజం లో ఆదర్శంగా నిలిచిందని, తన కుటుంబ సమస్యలు పరిష్కారం తో, ఓర్పు తో సహకారం అందిస్తున్నట్లు మెతుకు ఉప్పలయ్య తెలిపారు..తెలంగాణ మలిదశ ఉద్యమ సమయములో ప్రత్యేకఆర్థిక మండలి లో తెలంగాణ సెజ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్
సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను 2012 లో( రిజిస్ట్రేషన్ నంబర్. 925 /12) పూర్వపు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడయి తెలంగాణ సాధన ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నాడు.అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోతెలంగాణ సెజ్ పేరు తో ఏర్పడిన అసోసియేషన్ మొదటిది మరియు ఎకైక అసోసియేషన్. మరియు సెజ్ పేరు మీద భారతదేశం లోఏర్పాటు అయిన అసోసియేషన్ లలో ఇట్టి అసోసియేషన్ మొదటి వరుసలో ఉన్నది తనకు గుర్తింపు ఇచ్చిన ఇట్టి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరిశంకర్ కు మరియు ఇప్పటి వరకు సహకరిస్తున్న అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరియు ఇట్టి గుర్తింపు సత్కారం తన భార్య మెతుకు విజయలక్ష్మి కి చెందుతున్నట్లు తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ అఫ్ రికార్డు 2025 పురస్కార గ్రహిత మెతుకు ఉప్పలయ్య నేత తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


