త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం లోని నూతన నర్సరీలు ఏర్పాటు చేయాలనుకునే రైతులు లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే లైసెన్స్ ఉన్న రైతులు రెన్యువల్ చేయించుకోవాలని కడియం మండల ఉద్యానవన శాఖా నూతన అధికారి పులిదిండి లావణ్య తెలిపారు. జగ్గంపేట నుంచి బదిలీ పై కడియం మండలం నూతన ఉద్యానవన అధికారిణిగా లావణ్య భాధ్యతలు స్వీకరించారు.
ఆమె మాట్లాడుతూ నూతన నర్సరీల కొరకు రైతులు రైతు భరోసా సిబ్బంది ద్వారా దరఖాస్తు చేయాలని కోరారు. డాక్యుమెంట్లు వివరాలు, ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, 1బి జిరాక్స్ ఎఫ్.యమ్.బి. ఎల్.పి.యమ్. మ్యాప్, లైసెన్సు కలిగిన సర్వేయర్ ద్వారా చేయించబడిన పొలం యొక్క బ్లూ ప్రింట్, సాయిల్, వాటర్ అనాలసిస్ రిపోర్టు, సంబంధిత అధికారికి ఇచ్చినట్లయితే, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి 90 రోజుల వ్యవధిలో లైసెన్స్ మూడు సంవత్సరాల కాల పరిమితితో ఇవ్వడం జరుగుతుందని లావణ్య అన్నారు.
ఇప్పటికే లైసెన్స్ కలిగి కాలపరిమితి ముగిసిన రైతులు రెన్యువల్ కావలసిన వారు పాత లైసెన్స్, మరియు పైన తెలుపబడిన డాక్యుమెంట్లు, (బ్లూ ప్రింట్, సోషల్, వాటర్ అనాలసిస్,) మినహాయించి ఇచ్చినచో 30 రోజులలో రెన్యువల్ లైసెన్స్ మంజూరు చేయబడుతుందని లావణ్య అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండల ఉద్యానవన శాఖ అధికారి పి.లావణ్య, ఫోన్ నెంబర్:79950 86839 సంప్రదించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


