Cheyutha : చేయూత

TRINETHRAM NEWS

తేదీ : 13/07/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట పట్టణం, సుధా వారి పాలెం కు చెందినటువంటి అశ్వధాటి. వెంకటేశ్వర్లు అనే లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు అతని కాలుకు గాయమై ఆపరేషన్ జరిగింది.
ఈ సందర్భంగా అతని కుటుంబం ఆర్దికపరంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని వెంటనే చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు , మరియు రాధా రంగా మిత్ర మండలి కన్వీనర్ అచ్చు కోట.
మురళీకృష్ణ తన వంతు సహాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం, మందుల ఖర్చు ల నిమిత్తం రూపాయలు ఒక వెయ్యి ఐదు వందలు ను అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎవరికైనా నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అంటే నిరుపేదల పార్టీ అని తెలిపారు. ముందు ముందు ఈ సేవా కార్యక్రమాలను వేగంగా కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి. రాజ్యలక్ష్మి, టిడిపి జిల్లా కార్యవర్గ కార్యదర్శి అందేల. సౌరి ,జనసేన పార్టీ నాయకులు గోవిందు. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cheyutha

You cannot copy content of this page

Scroll to Top