AIYF : గ్రామ గ్రామాన ఏ ఐ వై ఎఫ్ జెండా

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 12 త్రినేత్రం న్యూస్. అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వైఎఫ్) డిండి మండల సమావేశం సి పి ఐ ప్రజాభవన్ లో జరిగింది. సమావేశానికి హాజరైన సి పి ఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కంకచారీ మాట్లాడుతూ యువతను చైతన్య పరచాలని గ్రామాల్లో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యువతను చైతన్యం చేసేందుకు గ్రామాలకు ఏ ఐ వై ఎఫ్ నాయకులు వెళ్లి ప్రతి గ్రామాల్లో కమిటీ వేసి జెండాలను ఎగరవేయాలనీ సూచించారు.
ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ యువజన సమాఖ్య బలోపేతం కోసం అన్ని గ్రామాల్లో నూతన కమ్మీటీలను ఎన్నుకొని పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్య క్రమంలో ఏ ఐ వై ఎఫ్ మండల అధ్యక్ష కార్య దర్షులు నరేష్ మహేష్ కోశాధికారి మధుకర్ అదిల్ ప్రవీణ్ గోవర్ధన్ సాయికుమార్ శివ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AIYF flag in village

You cannot copy content of this page

Scroll to Top