DVG Trust : డి.వి.జి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 11 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీ లో నివసించే చాకలి నరసమ్మ (52) కల్తీ కల్లు తాగి అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు ధైర్యం నింపి, ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. భాస్కర్, వెంకట్ నాయక్, లక్ష్మమ్మ, లింగం, సుధాకర్, శివ, బాబు, దర్శన్, సత్తయ్య, వీరప్ప, వెంకటయ్య కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

DVG Trust provides financial

You cannot copy content of this page

Scroll to Top