Dharna : పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ వద్ద ధర్నా

TRINETHRAM NEWS

పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వ రాయితీలు వర్తింప చేయండి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూలై,11: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.

ప్రసాద్ ఈసందర్భంగా మాట్లాడుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహిస్తున్నామని, ఆప్కాస్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని,రిటైర్మెంట్ అయిన ఆప్కాస్ కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం, గ్రాడ్యుటి వర్తింపచేయాలని, రిటైర్మెంట్ అయినా లేదా మృతి చెందిన వారి స్థానంలోవారి కుటుంబీకులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని, పారిశుద్ధ్య పనులు చేయుటకు డిప్టేషన్ పేరుతో వేసిన పోస్టులలో ఎవరూ పారిశుధ్య పనులు చేయడం లేదని, ఆఫీస్ కార్యాలయంలో మాత్రమే పని చేస్తున్నారని, వారి స్థానంలో పారిశుధ్య కార్మికుల రాకపోవడంతో పని కుంటుపడుతుందని, ఆ పని ఒత్తిడి భారం ఇతర కార్మికుల మీద పడుతుందని, డిప్టేషన్ రద్దు చేసి అదనపు సిబ్బంది నియమించి మెరుగైన పారిశుధ్యం కొరకు అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు.

సామర్లకోటలో డ్రైవింగ్ లైసెన్స్ లేని పిహెచ్సి కార్మికులతో డ్రైవర్ పనులు చేస్తున్నారని, ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారని, డ్రైవర్ల పోస్టులు లైసెన్సులు ఉన్న వారికే పదోన్నతుల కల్పించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన అన్నారు. పర్మినెంట్ కార్మికులకు డిఏలు, ఎంకౌస్మెంట్ సరెండర్ లీవులు, గ్రాడ్యుటి, సర్వీస్ స్కేల్, పి.ఆర్ సి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు.

కార్మికుల రక్త మాంసాలతో కూడిన శ్రమను దోచుపెట్టే విధంగా 10 పని గంటలు పెంచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,8 గంటల పని దినాలను కొనసాగించాలని, డిప్యూటీ సీఎం, కొణిదల పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గం లో టాయిలెట్ కార్మికులకు 4 నాలుగు వేల రూపాయలు జీతం మాత్రమే ఇస్తున్నారని వారి జీతాలు పెంచాలని,పారిశుద్ధ్య కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, పారిశుద్ధ్య కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించి ఆప్కాస్ కార్మికులందర్నీ పేర్మినెంట్ చేయాలని, కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకు, టాయిలెట్ కార్మికులకు, పార్కు కూలీలకు, స్కూల్స్ స్వీపర్లకు, వాచ్మెన్ లకు 21 వేలు కనీస వేతనాలు అమలు చేయాలని, పర్మినెంట్ కార్మికులకు ప్రభుత్వం వర్తింపజేసే అన్ని రాయితీలు వర్తింప చేయాలని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రసాదన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, నిమ్మకాయల ఈశ్వరరావు,బండి అప్పన్న, విక్కీ, మణికంఠ,సామర్లకోట యూనియన్ ప్రధాన కార్యదర్శి కసింకోట కిషోర్ అధ్యక్షులు బొత్సశ్రీనివాస్, కృష్ణ, బంగారు హరికృష్ణ తదితర మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharna at the Collectorate to

You cannot copy content of this page

Scroll to Top