కామారెడ్డి జిల్లా 10 జులై: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏఐటీయూసీ లో ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు చేరినట్లు ఎన్.హెచ్.ఎం.కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజానికానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎం.ఎల్. హెచ్.పి.లకు నెలకు రూ.44 వేల వేతనం తోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ కార్యదర్శి దశరథం,పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగులందరికీ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
గురువారం మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ కామారెడ్డి లో సమావేశం ఎస్.ఆర్.వి కాలేజీలో బీ.సందీప్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బి.ఎస్సీ, నర్సింగ్ విద్యార్హతతో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడిన ఎం.ఎల్ హెచ్.పి.ల.కు కనీస వేతనం రూ.44 వేలు ఇవ్వవలసి ఉండగా కేవలం 29 వేల 900 జీతం మాత్రమే చెల్లిస్తూ అధిక పనిభారాన్ని వారి పై మోపుతూ అన్ని స్థాయిలో పనులు వారితో చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఏఐటియూసి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని తెలియజేశారు.
ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరి మన రాష్ట్రంలో కూడా ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 5 శాతం పర్ఫార్మెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఈ సమావేశం అనంతరం కామారెడ్డి జిల్లా నూతన ఎమ్.ఎల్.హెచ్.పి.ల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి ఎమ్.ఎల్.హెచ్.పి ముఖ్య సలహాదారులుగా సుమన్, గౌరవ అధ్యక్షులు దశరథం (కామారెడ్డి జిల్లా సిపిఐ సెక్రటరీ), జిల్లా అధ్యక్షులుగా ఎం.శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ తానాజీ, వైస్ ప్రెసిడెంట్ అపర్ణ, జనరల్ సెక్రెటరీ బి. రమ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సందీప్, కోశాధికారిగా సాగర్, కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా సచిన్,వినయ్, స్వప్న, రాకేష్, సుష్మ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎమ్.ఎల్.హెచ్.పి.లు ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


