తేదీ : 09/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మోటూరు, దొండపాడు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి పర్వతం ప్రవేశపెట్టిన పథకాలు గురించి, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి గురించి ప్రజలకు కర పత్రాల ద్వారా వివరించడం జరిగింది. ప్రతిచోట ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. కులమత వర్గాల కతీతంగా , పేద ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని, గత ప్రభుత్వాల కంటే పేద కుటుంబాలకు అధిక సంక్షేమం అందిస్తున్నామన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం, సమస్యలు ఉన్నచోట పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి. వెంకటేశ్వరరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షులు వి. మురళి, టిడిపి నాయకులు చేకూరి. జగన్ మోహన్ రావు, కొడాలి. రామారాజు, మోటూరు, దొండపాడు గ్రామాల టిడిపి నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


