తేదీ : 09/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో జరిగినటువంటి కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మీటింగులో వైసిపి పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బ్రాండ్ కి ముప్పు గా మారేలా రెండు వందల కంపెనీలకు తప్పుడు ఈ – మెయిల్స్ పంపినట్టు మంత్రి వయ్యాపుల. కేశవ్ నివేదించగా ముఖ్యమంత్రి స్పందించారు. పెట్టుబడులు రాకుండా చేస్తున్నటువంటి వైసిపి కుట్రలపై విచారణ జరిపిస్తామని , స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే సహించనని ఆయన హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


