ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి…
మండపేట:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జాతీయ గ్రామీణ ఉపాధి పధకం ద్వారా రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న రైతుల పొలాలలో పండ్ల తోటల పెంపకం కార్యక్రమం అనేది ఒక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని చిన్న, సన్నకారు రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అన్నారు. మండపేట మండలం, జెడ్.మేడపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన రైతుల పొలాల్లో పండ్ల తోటలు పెంపకం కార్యక్రమం నకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని 60 కొబ్బరి మొక్కలు, 60 నిమ్మ మొక్కలు, 480 పామాయిల్ మొక్కల ను రైతులకు పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేయబడుతుంది కాబట్టి రైతులు ఎటువంటి పెట్టుబడి లేకుండా పండ్ల తోటలు పెంచవచ్చునన్నారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. అనంతరం అందరితో కలసి మొక్కలు నాటారు. ఈ అవకాశాన్ని చిన్న, సన్నకారు రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతరావు, మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, ఈదిపల్లి మంగరాజు, అత్తిలి వెంకన్నబాబు, సంగిశెట్టి అమ్మన్న, ఎలుబండి నాగయ్య, పిడుగు హరిబాబు, సి.హెచ్.సుబ్బారావు, తాతపూడి విన్నిబాబు, వడ్డి వీరాస్వామి, ఊడి నరసన్న, తిరుమలశెట్టి బాబి, ఎస్.చంద్రశేఖర్, కంచర్ల రామచంద్రరావు, కంచర్ల చిన్న, బి.అమర్ నాధ్, గట్టా రమేష్, భీమన శ్రీను, అధికార్లు ఎంపిడిఒ సత్యనారాయణ, ఎపిఒ, ఫీల్డ్ ఆఫీసర్, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


