అల్లూరిజిల్లా(అనంతగిరి) జూలై 8 త్రినేత్రం న్యూస్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి మరో మెట్టు ఎక్కింది. గుమ్మ పంచాయితీ పరిధిలోని కడరేవు, ముల్లెలు, నిమ్మ ఊట, మర్రెబంధ, చిట్టంపాడు వంటి 15 కు పైగా మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం రూ.11 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్ట్‌కి మార్గం సుగమమవుతోంది.
ఈ మేరకు సోమవారం నాడు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించింది. గ్రామాల సమస్యలు, రహదారి దుస్థితి తదితర అంశాలపై పర్యవేక్షణ బృందానికి అనంతగిరి మండల జనసేన అధ్యక్షులు చిట్టం మురళి వివరించారు.
“రహదారి లేకపోవడం వల్ల మా గ్రామాల్లో వైద్యం, విద్య, ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రతికూలంగా మారాయి. దశాబ్దాలుగా మేము అభివృద్ధికి దూరంగా ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన దిశగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది,” అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రి ని తమ గ్రామాల సందర్శనకు ఆహ్వానిస్తూ – “మీరు అడుగు పెడితే చాలు మా బ్రతుకులు మారుతాయి. మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న బాధలకు చెక్ పడుతుంది. మీ ఆలోచనలతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఊపందుకుంటోంది” అని ఆకాంక్షలు వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అఖిల్, సింహచలం, ఈశ్వరరావు, పూర్ణనంద్, వాసు, అలాగే తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాంగి రవీంద్ర, ఎం.రంజిత్, ఎస్.ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


