Financial Assistance : పీకే, రామయ్య కాలనీ లోని లివర్ అనారోగ్య బాధిత యువకుడు ప్రవీణ్ చికిత్స కీ నీడ 7500 రూపాయల ఆర్థిక సహాయం

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పీకే, రామయ్యా కాలనీకి చెందిన 23 సంవత్సరాల యువకుడు ప్రవీణ్ గత 6 నెలలుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న నీడ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పల్లెర్ల రమేష్ గౌడ్ నీడ మన వంద రూపాలు సమాజం కోసం గ్రూపు నుండి హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి 5000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ పీకే రామయ్య కాలనీలో ఉంటున్న యువకుడు ప్రవీణ్ పచ్చకామర్లు బాగా పెరిగాయని దీంతో కండ్లు పచ్చగామారాయని అనారోగ్యంతో ఏలాంటి ఆహారo తీసుకోవడం లేదని తెలిపారు.

కరీంనగర్ లోని అస్పత్రి లో చికిత్స తీసుకున్నప్పటికీ జబ్బు తగ్గడం లేదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాలని గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్న దారి ఖర్చులకు అక్కడ తిండికి డబ్బులు లేవని తెలిపారు. దీంతో నీడ స0స్థ తరపున 5000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు స్పందించిన స్థానికులు సంజీత్, గణేష్,ఆశ్రఫ్ అలీ,g. సాగర్,md జలీల్ పాషా లు కలిపి 2500 రూపాయలు అందించారాని మొత్తం బాధితునికి 7500 రూపాయల సహాయం అందినదని తెలిపారు ఈ కార్యక్రమం నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, స్థానికులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PK, Ramaiah Colony's liver

You cannot copy content of this page

Scroll to Top