సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా ప్రభావిత గ్రామమైన జనగామలో సింగరేణి యాజమాన్యం 2023 లో సుమారు ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను నిర్మించి, ప్రారంభించినప్పటికిని, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తాళం వేసి నిరుపయోగంగా ఉంచారని, తక్షణమే ఇట్టి ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏమైనా మరమ్మతు లు ఉంటే చేసి ఉపయోగం లోకి తెచ్చి ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ ఒక ప్రకటన లో సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జనగామ లోని మూసివేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బొగ్గు తవ్వకాల కోసం సమీప గ్రామాల భూములను స్వాధీనం చేసుకుని, గ్రామాల్లో అభివృద్ధి పై నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. గ్రామ ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి నిరుపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ ను పున ప్రారంభించి ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


